Ad Code

Responsive Advertisement

AP Senior Citizen Card Apply: 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు.

 AP Senior Citizen Card Apply: 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు.

AP Senior Citizen Card Apply: 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు.


  మీ ఇంట్లో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి AP Senior Citizen Card ను అందజేస్తోంది. మీ ఇంట్లో 60 సంవత్సరాల దాటిన వారు ఉంటే ఈ సీనియర్ సిటిజెన్ కార్డు ను ఉపయోగించుకోండి. లేదంటే మీకు తెలిసిన మీ ఇంటి పక్కన వారు లేదా బంధువులకు తెలియజేయండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డును అప్లై చేసుకోవడం ద్వారా కొన్ని రకాల లాభాలు ఉన్నాయి. 


Senior Citizen Card యొక్క లాభాలు?


  బస్సు మరియు రైలు ప్రయాణాల్లో రాయితీ-  60 సంవత్సరాలు దాటిన పురుషులు, 58 సంవత్సరాలు దాటిన మహిళలకు బస్సు మరియు రైలు టికెట్లలో 40% రాయితీ ఉంటుంది. 
  80 సంవత్సరాలు దాటిన పురుషులు మరియు మహిళా వృద్ధులకు బస్సు మరియు రైలు టికెట్ల లో 50% టికెట్ రాయితీ ఉంటుంది.

Health benifits- సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నవారికి ఆసుపత్రులలో లైన్లో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రకాల టెస్టులలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డయాగ్నసిస్ టెస్టు లో రాయితీ ఇవ్వడం జరుగుతుంది.

బ్యాంకు ప్రయోజనాలు- సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నవారికి ఫిక్స్డ్ డిపార్ట్మెంటు మరియు సేవింగ్స్ స్కీములపై ఎక్కువగా వడ్డీ వస్తుంది. 

  అలాగే 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈ సీనియర్ సిటిజెన్ కార్డు ఉంటే ఇన్కమ్ టాక్స్ లో మినహాయింపు ఉంటుంది. 

  ఈ ప్రయోజనాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పథకాలలో ప్రయోజనాలు ఉంటాయి. దీంతోపాటు ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కి అర్హత సాధిస్తారు. 

  మ్యూజియంలలో, సినిమా హాళ్లలో, పార్కులలో వాటి యొక్క ఫీజులలో మీకు రాయితీ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కూడా తగ్గింపు ఉంటుంది. 

How to Apply For AP Senior Citizen Card: 


  మనకున్న సమాచారం మేరకు ఈ Andhra Pradesh Senior Citizen Card ను మీకు దగ్గరలోని సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవాలి. మీకు సంబంధించిన సచివాలయం దగ్గరకు వెళ్లి ఆ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెల్లి ఈ సీనియర్ సిటిజన్ కార్డును అప్లై చేసుకోవచ్చు. 
  ప్రస్తుతానికి అయితే సెల్ఫ్ గా అప్లై చేసుకోవడానికి లేదు. అంటే తమకు తాముగా అప్లై చేసుకోవడానికి లేదు. 

  40 రూపాయలను తీసుకొని సచివాలయం దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోండి. 

 సీనియర్ సిటిజన్ కార్డు ఎన్ని రోజులకు వస్తుంది?

  ఇంతకుముందు ఈ సీనియర్ సిటిజన్ కార్డు రావాలి అంటే అప్లై చేసుకున్న తర్వాత పై అధికారి దగ్గరకు వెళ్లి ప్రాసెస్ మొత్తం పూర్తయి కార్డు డౌన్లోడ్ కి రావాలి అంటే ఏడు రోజుల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం మనం అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఈ కార్డు డౌన్లోడ్ కి రావడం జరుగుతుంది.


Important Documents for Ap Senior Citizen Card:  

  ఈ Ap Senior Citizen Card ను అప్లై చేసుకోవాలి అంటే పురుషులు లేదా మహిళలలు 60 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.ఈ 60 సంవత్సరాల వయసు అనేది వారు ఎప్పుడైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ డేట్ కు సరిపోయి ఉండాలి.

1) ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోను తీసుకోండి. 

2) ఆధార్ కార్డును తీసుకోండి. 

3) ఫోన్ నెంబర్ (దీనికి ఆధార్ లింకు అయి ఉన్న సరిపోతుంది. లేకున్నా కూడా సరిపోతుంది.)

4) ఈ కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, అతనికి లేదా ఆమెకు అత్యవసరంగా పలికే ఒక వ్యక్తి పేరు మరియు అతని మొబైల్ నెంబరు తీసుకొని వెళ్లాలి. 

5) అలాగే మీ యొక్క బ్లడ్ గ్రూపును కూడా తెలుసుకొని వెళ్ళండి. 

6) ఆధార్ అప్డేట్ హిస్టరీ: ఈ కార్డు అనేది 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇచ్చేది కాబట్టి ఎవరైనా ఈ AP Senior Citizen Card కోసం తమ ఆధార్ కార్డులో ఏవైనా అప్డేట్స్ చేశారా అని చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు ఉంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ పెట్టారా లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారా అని చూడడం జరుగుతుంది. 
  ఈ ఆధార్ అప్డేట్ను మీరే సెల్ఫ్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సచివాలయానికి వెళ్ళిన తర్వాత వాళ్లే డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 

  పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, అలాగే 40 రూపాయల డబ్బులు తీసుకొని మీకు ఏ సచివాలయం అయితే ఉంటుందో ఆ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ని కలవండి. సార్ మాకు AP Senior Citizen Card కావాలి అని అడగండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. 

  తమ సచివాలయానికి దూరంగా ఉండేవారు ఓటీపీ ద్వారా కూడా ఈ AP Senior Citizen Card కార్డును అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓటీపీ ద్వారా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఆధార్ కార్డు కు లింక్ అయినా మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి.  కాబట్టి అసలు మిస్ చేసుకోకండి.

AP Senior Citizen Card యొక్క లక్ష్యాలు:

  వృద్ధుల యొక్క ఆరోగ్యం మరియు వారి వారి యొక్క భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.  వృద్ధులకు ప్రభుత్వం ప్రయోజనాలను సులభతరం చేయడం. వృద్ధుల యొక్క ఆర్థిక స్వతంత్రాన్ని ఈ AP Senior Citizen Card ద్వారా పెంపొందించడం. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు