Ad Code

Responsive Advertisement

AP new Ration Card 2025, eKYC in telugu: ఏటీఎం కార్డు రూపంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు

 AP new Ration Card 2025, eKYC in telugu: ఏటీఎం కార్డు రూపంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు

AP new Ration Card 2025 in telugu: ఏటీఎం కార్డు రూపంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు


  

AP new Ration Card 2025 in telugu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డులలో కొత్త మెంబర్లని చేర్చడం గురించి గానీ, రేషన్ కార్డులో ఉన్న మెంబర్లని విభజన చేసి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి, ఉన్న మెంబర్లని డిలీట్ చేయడం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్డేట్ రావడం జరిగింది. 


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏప్రిల్ 01, 2025వ తేదీన విలేకరులను సమావేశపరిచి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. 

  ఈ విలేకరుల సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. కొత్తగా రేషన్ కార్డులు ఏటీఎం కార్డు రూపంలో రానున్నాయని తెలిపారు. ఇందులోని ప్రత్యేకతలను కూడా ఆయన వివరించారు. ఈ కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు నెంబర్తో రానున్నాయి. ఈ రేషన్ కార్డులో ఈసారి చిన్న రేషన్ కార్డు రూపంలో రానున్నాయి, అంటే ఏటీఎం కార్డు రూపంలో ఉండనున్నాయి.

  ఈ ఏటీఎం కార్డు రూపంలో వచ్చే కొత్త రేషన్ కార్డులలో.. ముందు పక్క ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డు వస్తుందో వారి ఫోటో మరియు వారి యొక్క పేరు వివరాలు ఉంటాయి. అలాగే ఈ ముందు పక్కా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మిగిలిన కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఉంటాయి. 

   ఈ స్మాట్ కార్డులు ఎప్పుడు రానున్నాయి అని కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుంది. ఈ యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ఏప్రిల్ 30, 2025వ తేదీ వరకు జరగనుంది. ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. 

  ఇవి విలేకరుల సమావేశంలో పౌరసరాఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి విలేకరులు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. చాలామంది రాష్ట్రంలో కార్డు విభజన, నెంబర్లని యాడ్ చేసుకోవడానికి, అడ్రసుల్లో చేంజ్ చేసుకోవడానికి, లేదా డిలీట్ చేసుకోవడానికి ఇటువంటి సమాచారం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని విలేకరులు ఆయనను అడగడం జరిగింది. ఈ ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ గారు జవాబు ఇస్తూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈకేవైసీకి సమయం ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి ఇంటికి ఈ స్మార్ట్ రేషన్ కార్డు ను మంజూరు చేయనున్నారు. ఈ రేషన్ కార్డులను మంజూరు చేసిన తర్వాత కొత్తగా పెళ్లయిన మెంబర్లను యాడ్ చేసుకోవడానికి, అడ్రసుల్లో చేంజ్ చేసుకోవడానికి, కార్డు విభజన చేసుకోవడానికి లేదా మెంబర్లను డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ రేషన్ కార్డును మల్టీపర్పస్ కార్డు కింద వాడుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. 

AP Ration Card ekyc: 


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుంది. ఈకేవైసీ అంటే ఎవరైతే ఈ మధ్యకాలంలో తంబు(వేలిముద్ర) వేయకుండా ఉంటారో అలాంటివారు ప్రస్తుతం ఉన్నారో లేరో అనే డౌటుతో ప్రభుత్వం ఈ ఈకెవేసి ప్రక్రియను చేస్తోంది. ఈ ఈకేవైసీ ని ఎలా చేసుకోవాలి అంటే.. గతంలో రేషన్ షాపులలో రేషన్ ఎలా తీసుకునేవారు. ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. ఒకసారి స్టేషన్ షాపు దగ్గరకు వెళ్లి మీ కుటుంబ సభ్యులకు ఈ కేవైసీ అయిందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే సచివాలయం దగ్గరకు వెళ్లి చేసుకోండి. 

  మీ ఊరికి మీరు చాలా దూరంగా ఉండి ఉంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు ప్రస్తుతం ఉన్న గ్రామం లోని సచివాలయంలోకి వెళ్లి ఈ కేవైసీ ని చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 

  మీరు ఈ రాష్ట్రంలోనే లేరు అని అనుకుంటే మీ గ్రామ సచివాలయం కి ఫోన్ చేసి, ఓటిపి ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.

   గమనిక ఏమిటంటే ఎవరికైతే ఈకేవైసీ అవ్వలేదో వారు మాత్రమే ఈకెవైసీ నీ చేయించుకోవాలి. మిగతా వారికి ఈ రేషన్ ఈకేవైసీ అవసరం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు