CSIR-NAL Recruitment 2025 in telugu: 10+2 క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు
CSIR ( కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) కింద పని చేస్తున్నటువంటి నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీస్(NAL), బెంగళూరు నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ సిఎస్ఐఆర్ అనే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) సంస్థ గవర్నమెంట్ సంస్థ. వీటి నుండి విడుదల అయ్యే ఉద్యోగాలు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఈ నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీస్(NAL) రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ను భర్తీ చేస్తున్నారు.
ఈ CSIR-NAL నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఏప్రిల్ 16, 2025 వ తేదీ ఉదయం 9 గంటల నుండి మే 20, 2025 సాయంత్రం 5 గంటల లోపు www.nal.res.in ఆన్లైన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.
ఈ ఉద్యోగాల కోసం మెల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండి తగిన క్వాలిఫికేషన్ కలిగిన మేల్ అండ్డ్ ఫిమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ CSIR-NAL Recruitment 2025 ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (General Administration )- 9 (అన్ రిజర్వుడ్డ్ - 05, ఓబిసి-01, ఎస్సీ-02, ఎస్టీ-01, (వీటిలో ఏదైనా ఒక పోస్టును ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ క్యాండిడేట్ కి కేటాయించడం జరిగింది.)) పోస్టులను, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (Stores & Purchase) - 05 (అన్ రిజర్వ్డ్ - 03, ఓబీసీ-1, ఎస్సీ-1, ఈ ఉద్యోగాలలో ఒక పోస్టును స్పోర్ట్స్ కోటా కలిగిన విద్యార్థులకు కేటాయించడం జరిగింది.) పోస్టులు, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (Finance & Accounts) - 07 (అన్ రిజర్వుడ్ - 3, ఓబిసి - 01, ఈడబ్ల్యూఎస్-1, ఎస్సీ-02, వీటిల్లో ఒక పోస్టును ఈఎస్ఎం అభ్యర్థులకు కేటాయించడం జరిగింది.) పోస్టులను మరియు
జూనియర్ స్టెనోగ్రాఫర్ - 05 ( అన్ రిజర్వ్డ్ -03, ఎస్సీ - 01, ఎస్టీ - 01) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తంగా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 26 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Age Limit:
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (General Administration ), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (Stores & Purchase), జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (Finance & Accounts) ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.
జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీకి ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి నాన్ క్రిమీలేయర్ అభ్యర్థులకు 13 సంవత్సరములు మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
10+2 క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. మరియు
జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకి ప్రొఫిసియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ ని నిర్వహించడం జరుగుతుంది.
Selection Process:
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ( GEN/F&A/S&P):
ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ వ్రిటన్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్ టైపింగ్ ప్రొఫిసియన్సీని నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
కంప్యూటర్ రిటన్ ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ 1 మరియు పేపర్ 2. ఇందులో పేపర్ వన్ లో క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ అనేది పేపర్ 2 నుండి తీయడం జరుగుతుంది.
ఈ రిటర్న్ ఎగ్జాం అనేది ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ రూపంలో ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. ఎగ్జామ్ డిఫికల్టీ వచ్చేసి 12th స్టాండర్డ్ లో ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జాం ను 200 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది.
పేపర్ - 1:
100 ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ నుండి రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున, 100 ప్రశ్నలకు గాను 200 మార్కులకు ఈ పేపర్ వన్ ఉంటుంది. టోటల్గా 90 నిమిషాల పాటు ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.
పేపర్ - 2:
జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 100 ప్రశ్నలకు గాను 300 మార్పులు చొప్పున ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ ను 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంది.
ప్రొఫిసియన్సీ టెస్ట్:
రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఈ కంప్యూటర్ బేస్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో 10 నిమిషాల పాటు ఉంటుంది.
మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు?
రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ లో పేపర్ వన్ లో క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 2 లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ టైపింగ్ ప్రొఫెసెన్సీ టెస్ట్ లో కూడా క్వాలిఫై అవుతే సరిపోతుంది.
జూనియర్ స్టేనోగ్రాఫర్:
రిటర్న్ ఎగ్జామ్ మరియు ప్రొఫిసియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలకి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
రిటర్న్ ఎగ్జాం అనేది ఓఎంఆర్ బేస్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. పేపర్ డిఫికల్టీ 10+2 లెవెల్ లో ఉంటుంది.
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కంప్రహెన్షన్ నుండి 100 ప్రశ్నలు మొత్తంగా 200 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు గాను ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
అలాగే ప్రొఫిసియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రొఫెసన్స్ ఇన్ స్టెనోగ్రాఫర్ టెస్ట్ క్వాలిఫై అవుతే సరిపోతుంది. మెరిట్ లిస్టు అనేది రిటన్ ఎగ్జామినేషన్ నుండి తీయడం జరుగుతుంది.
Application Fee:
ఈ CSIR-NAL ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Salary:
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు లెవెల్-2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి డేర్నీస్ అలవెన్స్ (DA), హౌస్ రెంటు అలవెన్స్ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ (TA) లాంటి బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అప్రాక్స్ మెట్లీగా ప్రతినెలా 39,000 రూపాయల మధ్య సాలరీ రావడం జరుగుతుంది.
జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు లెవెల్-4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది. అన్ని అలోవెన్సెస్ కలుపుకొని అప్రాక్సీమేట్లీగా ప్రతినెల 49,000 రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది.
Official Website: www.nal.res.in
0 కామెంట్‌లు