TGSRTC Recruitment 2025 in telugu: తెలంగాణ ఆర్టీసీ లో ఉద్యోగాలు
హలో ఫ్రెండ్స్ తెలంగాణ అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి త్వరలో భారీగా 3038 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది.
హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనర్ గారు అటెండ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఆర్టీసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోని ఉద్యోగులందరికీ ఎటువంటి సమస్యలు లేకుండా మేము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.
అయితే ఈ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ఉన్నటువంటి 3038 ఖాళీలకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం.
ఈ ఉద్యోగాలు పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ రిక్రూట్మెంట్ ను మిస్ చేసుకోకండి.
ఈ TGRTC(Telangana State Road Transport Corporation) నుండి టోటల్గా 3039 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ 3039 పోస్టులలో డ్రైవర్ - 2000 పోస్టులు, శ్రామిక్ - 743 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ - 25 పోస్టులు, అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ - 15 పోస్టులు, డిప్యూటీ సూపరిండెంట్- 84 పోస్టులు, డిప్యూటీ సుపరిండెంట్ మెకానిక్ - 144 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ - 23 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ - 11 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్ మరియు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ TGSRTC నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. గతంలో 3035 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే తాజగా 3038 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
ఈ పోస్టుల వివరాలను తెలంగాణ ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది.
Age Limit:
ఈ తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
డ్రైవర్ పోస్టులకి టెన్త్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే కొన్ని పోస్టులకి పదవ తరగతి క్వాలిఫికేషన్ ఇవ్వడం, మరి కొన్ని పోస్టులకి ఇంటర్/10+2 క్వాలిఫికేషన్ ఇవ్వడం, మరి కొన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు మనం కచ్చితంగా చెప్పుకుందాం.
Selection Process:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. వారు ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి మెరిట్ ఆధారంగా ఈ తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ ఎవరు ఇటువంటి నోటిఫికేషన్ను నెగ్లెక్ట్ చేయొద్దు.
Application Fee:
అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత తెలుసుకుందాం. అయితే ఎస్సీ మరియు ఎస్టీకి ఎటువంటి ఫీజు ఉండదు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే విడుదలవుతుంది. విడుదల కాగానే మీకు ముఖ్యమైన తేదీలను అప్డేట్ చేయడం జరుగుతుంది.
How to apply:
నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) యొక్క అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించి అప్లై లింకు యాక్టివేట్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇంస్రక్షన్స్ బాగా చదువుకొని అప్లై చేసుకోవాలి. అప్లై ప్రాసెస్లో ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోవాలి. ఫోటో మరియు తదుపరి డాక్యుమెంట్లు వారు చెప్పిన సైజులో పెట్టుకోవాలి.
ఈ తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ నుండి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల కానుంది. విడుదల కాగానే మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూపులో ఫాలో అవ్వండి. ఈ పోస్టులను ఎటువంటి ఎగ్జామ్ లేకుండా భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ అస్సలు మిస్ చేసుకోకండి.
0 కామెంట్‌లు