Ad Code

Responsive Advertisement

Telangana Job Notifications: తెలంగాణ రాష్ట్రం లో విడుదల కాబోయే ఉద్యోగ వివరాలు.

Telangana Job Notifications: తెలంగాణ రాష్ట్రం లో విడుదల కాబోయే ఉద్యోగ వివరాలు.

Telangana Job Notifications: తెలంగాణ రాష్ట్రం లో విడుదల కాబోయే ఉద్యోగ వివరాలు.


Telangana Job Notifications: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు రావాల్సిన అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ వలన ఆలస్యం అయ్యాయి. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పాస్ కావడం జరిగింది. గవర్నర్ ఆమోదం పొంది అది ప్రెసిడెంట్ కి కూడా పంపించడం జరిగింది. 


  ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి నూతనంగా నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్రంలో విడుదల అవ్వనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు సంవత్సరానికి సరిపడా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ఎసి వర్గీకరణ వలన ఆలస్యమైంది. అదే జాబ్ క్యాలెండర్ ని డేట్స్ ను మార్చి మళ్లీ విడుదల చేయనున్నారు. ఇప్పుడు వస్తున్నా వార్త పత్రికల ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం లో ఇకనుండి ఉద్యోగాల జాతర జరగనుంది అని తెలుస్తుంది. 


  ఈ సమాచారం మేరకు తెలంగాణ గ్రూప్ -1 లో 300 పోస్టులు, గ్రూపు 2 లో 800 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

   తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-3 తో పాటు గ్రూపు-4 పోస్టులను కలిపి ఇస్తే 5 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఏజ్ ఉంటే ఈ పోస్టులకి అర్హులు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.


   హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఎస్సై (సబ్ ఇన్స్పెక్టర్) కాలీలు 700, కానిస్టేబుల్ ఉద్యోగాలు 12000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అర్హులు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కానిస్టేబుల్ పోస్టులకి అర్హులు. ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్ మరియు మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.


   డీఎస్సీలో దాదాపు 7వేల వరకు ఖాళీలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు ఉంటే రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.


   ట్రాన్స్ కో, జన్ కో, ఎన్పిడీసీఎల్, ఎస్పీడీసీఎల్  లాంటి పవర్ సెక్టార్లలో సుమారు 4000 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. గజిటెడ్ మరియు నాన్ వెజిటేబుల్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. ఖాళీలు అయితే ఉన్నాయి కానీ ఎన్ని ఖాళీలు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. గజిటెడ్ ఉద్యోగాలు అంటే ఇక్కడ డిప్యూటీ ఈవో గని, హెచ్ఎం మరియు ప్రిన్సిపల్స్ ఈ ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి ఉద్యోగాల ఖాళీల స్పష్టత లేదు అయితే త్వరలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.


   గ్రామస్థాయిలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉద్యోగాలు 5 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండి 10+2 క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.


  అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 3038 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎండి సజ్జనర్ గారు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటి కాలిలను తెలిపారు. ఈ TGRTC నోటిఫికేషన్ వచ్చే నేల విడుదల కావడానికి అవకాశం ఉంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా..

 డ్రైవర్ - 2000

 శ్రామిక్ - 743

 డిప్యూటీ మేనేజర్ - 25

 అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ - 15 

 డిప్యూటీ సూపరిండెంట్- 84

 డిప్యూటీ సుపరిండెంట్ మెకానిక్ - 144

 అసిస్టెంట్ ఇంజనీర్ - 23

 సెక్షన్ ఆఫీసర్ - 11

 అకౌంట్స్ ఆఫీసర్ మరియు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  TGRTC Jobs


  మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి 14,236 పోస్టులతో అంగన్వాడీ కేంద్రాల్లో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో 4వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 6,399 టీచర్ పోస్టులను మరియు 7,837 అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగిన వారందరూ ఈ అంగన్వాడీ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఈ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. ఎస్సీ మరియు ఎస్టి క్యాండిడేట్స్ 18 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.


  బయట సమాచారం మేరకు మే నెలలో వచ్చే నోటిఫికేషన్ లను చూద్దాం. 


అంగన్వాడి ఉద్యోగాలు 14,236 పోస్టులతో, ఆర్టీసీ ఉద్యోగాలు 3038 పోస్టులతో, డీఎస్సీ దాదాపు 7వేల పోస్టులతో, 4000 పోస్టులతో హెల్త్ డిపార్ట్మెంటులో మరియు వీఆర్వో మరియు వీఆర్ఏ ఉద్యోగాలు 5 వేల పోస్టుల తో నోటిఫికేషన్లు విడుదల అవ్వనున్నాయి. 


  ఈ ఉద్యోగాలు ఏప్రిల్ నెలాఖరులో లేదా మే నెలలో విడుదలవనున్నాయి.  


  సమాచారం మేరకు రాబోయే గ్రూప్స్ లాంటి నోటిఫికేషన్లలో సిలబస్ మరియు పరీక్ష విధానాలలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.


  ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారు. వారి ప్రిపరేషన్ మంచిగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్లు అటూ ఇటూ కావచ్చు కానీ విడుదల అవ్వడం మాత్రం కచ్చితంగా విడుదలవుతాయి. కాబట్టి కన్సిస్టెన్సీగా చదవండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు